Modi:దక్షిణ భారత్‌కు గేట్‌వే తెలంగాణ

25
- Advertisement -

తెలంగాణ దక్షిణ భారత్‌కు గేట్ వే అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పేదల కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తున్నామని…భారతీయులంతా తన కుటుంబం అన్నారు. సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మోడీ…అయోధ్య ఆలయంలో రామలల్లా ప్రతిష్ఠాపన చేశామన్నారు.

ప్రతిపక్షాలు యువతను ప్రోత్సహించడం లేదని, 70 ఏళ్లు పైబడిన వారిని ప్రోత్సహిస్తున్నాయని, యువత పట్ల అభద్రతా భావాన్ని కలిగిస్తున్నారన్నారు. రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధి అని నమ్ముతానని చెప్పారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో సివిల్‌ ఏవియేషన్‌ రీసెర్చ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.

ఈ ఏవియేషన్ ఈ కేంద్రం ద్వారా హైదరాబాద్‌, తెలంగాణకు గుర్తింపు వస్తుందని చెప్పారు. గత పదేండ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపయిందని …ఘట్‌కేసర్‌-లింగపల్లి ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసు ఇప్పటికే ప్రారంభమైందని గుర్తుచేశారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి కట్టుబడి ఉన్నారని అన్నారు.

Also Read:ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రధాని

- Advertisement -