రైల్వే కొత్త నిబంధన..‘నో బిల్‌.. ఫ్రీ ఫుడ్‌’

218
Indian Railways launches no bill, free food policy!
- Advertisement -

ఇండియన్‌ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. అక్రమాలకు పాల్పడుతూ.. అధిక చార్జీలు వసూలు చేసే కేటరర్లకు ముకుతాడు వేసేందుకు భారతీయ రైల్వే కొత్త నిబంధనలను అమలు చేయనుంది. రైల్వే ప్రయాణికులకు ఊరటనిచ్చేలా భారతీయ రైల్వే సరికొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. రైళ్లలో ప్రయాణికులకు అందించే భోజనం, ఇతర తినుబండారాలు, టీ, కాఫీ, కూల్‌డ్రింకులకు సంబంధించి రసీదు ఇవ్వకుంటే బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈమేరకు రైల్వే నిబంధనలు రూపొందిస్తోంది.

Indian Railways launches no bill, free food policy

‘నోబిల్-ఫ్రీ పుడ్’ పేరుతో సరికొత్త విధానాన్ని తీసుకు రావాలంటూ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అధికారులను ఆదేశించారు. ఈ వివరాలను ‘ఐఆర్‌సీటీసీ’ ఇప్పటికే వెబ్‌సైట్‌లో పొందుపరిచి ప్రయాణికులకు అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టింది. ఇన్‌స్పెక్టర్లను రైళ్లలో నియమించి ప్రయాణికులకు కేటరర్లు రసీదులు ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. రసీదులు ఇవ్వడానికి కేటరర్లు నిరాకరిస్తున్నట్టు ప్రభుత్వానికి ఏడువేలకు పైగా ఫిర్యాదులు అందడంతో రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -