కరోనా ఎఫెక్ట్‌.. రైల్వే శాఖ కీలక నిర్ణయం..

268
Indian Railway

కరోనా వైరస్‌(కోవిడ్‌-19) వ్యాప్తి నివారణకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.10 ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధరను 50 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. మొత్తం 250 రైల్వే స్టేషన్లలో టికెట్ల ధర పెంపు వర్తిస్తుందని పేర్కొంది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పెంచిన ధరలు అమల్లో ఉంటాయని రైల్వే శాఖ తెలిపింది. రైల్వే స్టేషన్లలో కరోనా ప్రభావాన్ని తగించేందుకు ఈ విధమైన చర్యలకు ఉపక్రమించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.