హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సీజన్-10 ఘనంగా ప్రారంభమైంది. ఆర్సీబీ వైస్ కెప్టెన్ షేన్ వాట్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. భుజం గాయంతో ఈ మ్యాచ్‌కు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. అంతకుముందు స్టేడియంలో మాజీ లెజండరీ ఆటగాళ్లు సచిన్ టెండుల్కర్, సౌరబ్ గంగూళీ, వివిఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వగ్ లను స్టేడియంలోకి ఆహ్వానిస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో మైదానంలో తిరుగుతూ, అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా సచిన్, గంగూలీ, సెహ్వాగ్, లక్ష్మణ్ లను బీసీసీఐ సత్కరించి జ్ఞాపికలు అందజేసింది. అనంతరం రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెన్ టాప్ వాహనంలో మైదానంలోకి వచ్చాడు. వెంటనే డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి డేవిడ్ వార్నర్ కరతాళ ధ్వనుల మధ్య ఐపీఎల్ ట్రోఫీ తీసుకొని వేదికపైకి వచ్చాడు. కోహ్లీతో కరచాలనం చేసి ప్రత్యేక జ్ఞాపిక అందజేశాడు
మ్యూజీక్ మాస్ట్రో ఏఆర్ రెహ్మాన్, అమీజాక్సన్ లైవ్ ఫర్‌ఫార్మెన్స్‌తో ఐపీఎల్-10 ప్రారంభ వేడుకల్లో అదరగొట్టారు. తమ్మా తమ్మా అగైన్, కాలా ఛష్మా సాంగ్స్‌కి అమీజాక్సన్ డ్యాన్స్ చేస్తూ ఆడియెన్స్‌ని అలరించింది. ఐపీఎల్ సీజన్-10లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగనున్న తొలి పోటీని వీక్షించేందుకు క్రీడాభిమానులు ఉప్పల్ స్టేడియానికి తరలివస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 8జట్లు తలపడనున్నాయి. నేటి నుంచి మే 21వరకు 48 రోజులపాటు ఐపీఎల్-10 జరుగనుంది. హోమ్ టీమ్ హైదరాబాద్‌తో బెంగుళూర్ తలపడనుంది. ఫైనల్ మ్యాచ్‌ను కూడా హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో మొత్తం 8 మ్యాచ్‌లు జరగనున్నాయి.