రేవంత్, రోహిత్‌లకు కేటీఆర్ సన్మానం

142
'Indian Idol' winner Revanth meets KTR

ఇండియన్ పాపులర్ టీవీషోలో విజయం సాధించిన విజేతలను మంత్రి కెటి రామారావు అభినందించారు. ఇవాళ  బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కెటి రామారావు విజేతలు రేవంత్,  రోహిత్ లు కలిశారు. ఇండియన్ ఐడల్  లాంటి జాతీయ స్ధాయి పోటీల్లో విజయం సాధించడం పెద్ద విషయమన్న, మంత్రి సరైన నిబద్దత, పట్టుదలతో కష్టపడితే అడ్డంకులను అధికమించి విజయం సాధించవచ్చని వీరు నిరూపించారని కొనియాడారు. మంత్రి కేటీఆర్ వారికి శాలువా కప్పి, మెమెంటోను అందజేసి ఘనంగా సత్కరించారు.

'Indian Idol' winner Revanth meets KTR

హిందీ భాష రాకున్న పట్టుదలతో పాటలు పాడి, దేశం మెత్తాన్ని వీరు మెప్పించిన తీరు యువతకు సందేశాన్ని, స్పూర్తిని ఇస్తుందన్నారు. ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో వీరి ప్రదర్శన తిలకించానని, రోహిత్ పాడిన తీరు అద్బుతంగా ఉందని తెలిపారు. పైనల్స్‌కు ముందు మీరు పంపిన వీడియో సందేశం చాల స్పూర్తినిచ్చిందని, ఆది ఓటింగ్ పెరగడానికి సహకరించిందని ఇండియన్ ఐడల్ విజేత రోహిత్ మంత్రికి ఈ మేరకు  దన్యవాదాలు తెలిపారు. విజేతలకు అభినందనలు తెలిపిన మంత్రి, భవిష్యత్తులో ప్రభుత్వం తరపున అవసరమైన సహకారాన్ని అందిస్తామని తెలిపారు.