venezuela:భారత విదేశాంగ శాఖ కీలక అడ్వైజరీ

2
- Advertisement -

వెనెజులాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక అడ్వైజరీని జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత పౌరులు వెనెజులాకు అనవసర ప్రయాణాలు చేయవద్దని స్పష్టంగా సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప వెనెజులా వెళ్లకూడదని హెచ్చరించింది. ఇప్పటికే అక్కడ ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక పరిణామాలను జాగ్రత్తగా గమనించాలని సూచించింది.

ఏదైనా సమస్య లేదా అత్యవసర సహాయం అవసరమైతే కారకస్‌లోని భారత దౌత్య కార్యాలయాన్ని వెంటనే సంప్రదించాలని విదేశాంగ శాఖ తెలిపింది. ఇందుకోసం cons.caracas@mea.gov.in అనే ఈ-మెయిల్ ఐడీతో పాటు +58-412-9584288 ఫోన్ నంబర్‌ను కూడా విడుదల చేసింది. భారత పౌరుల భద్రతే అత్యున్నత ప్రాధాన్యమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా ప్రత్యేక దళాలు అరెస్టు చేసి న్యూయార్క్‌కు తరలించారనే వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నార్కో-టెర్రరిజం కేసుల్లో మదురో విచారణను ఎదుర్కోనున్నారని సమాచారం. ఈ పరిణామాలతో వెనెజులాలో రాజకీయ, భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ముందస్తు జాగ్రత్తగా ఈ అడ్వైజరీ జారీ చేసినట్లు తెలుస్తోంది.

Also Read:వెనిజులాపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -