టీంఇండియా డ్రెస్ కోడ్ మారింది. అవును నిజమే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆరెంజ్ జెర్సీలో కనిపించనున్నారు. రేపు ఇంగ్లాండ్, ఇండియా మధ్య మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. బ్లూ మరియు అరేంజ్ రంగులతో కొత్త జెర్సీని డిజైన్ చేశారు. తాజాగా ఇండియా ప్లేయర్లు ఆడ్రెస్ లు ధరించి ఫోటోలు దిగారు. ఈఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆరెంజ్ జెర్సీలో టీమిండియా ప్లేయర్లు డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు.
జట్టు అధికారిక స్పాన్సర్ నైకీ సంస్థ అత్యుత్తమ శ్రేణిలో జెర్సీకి రూపకల్పన చేసింది. ఆటగాళ్లకు అనుకూలంగా ఉండే విధంగా డ్రెస్‌ను డిజైన్ చేశారు. అయితే ఐసీసీ నిభందనల ప్రకారం ఆతిధ్య జట్టు తప్ప మిగతా జట్లు అన్ని రెండు రకాల కిట్లను పంపించాలి . ఒకే విధమైన జెర్సీ కలిగియున్న జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు మాత్రం వేరే రకమైన జెర్సీని ధరించాలి .. మ్యాచ్ ని వీక్షించే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ కాకుండా ఉండేదుకు ఈ పద్దతిని అనుసరిస్తారు .