- Advertisement -
భారత పర్వతారోహకురాలు బల్జీత్ కౌర్ అరుదైన ఘనత సాధించింది. రెండు వారాల తేడాలోనే నేపాల్ లో ఉన్న రెండు అత్యంత ఎత్తైన శిఖరాలు అధిరోహించి వార్తల్లో నిలిచింది. ఎనిమిది వేల మీటర్ల ఎత్తయిన రెండు పర్వతాలను మౌంట్ కాంచనగంగ, మౌంట్ అన్నపూర్ణ పర్వతాలను బల్జీత్ కౌర్ అధిరోహించారు.
మౌంట్ కాంచన గంగ ఎత్తు 8586 మీటర్లు, మౌంట్ అన్నపూర్ణ ఎత్తు 8091 మీటర్లు రెండు వారాల తేడాలోనే అధిరోహించి అరుదైన ఫీట్ సాధించారు.
బల్జీత్ కౌర్ స్వస్థలం హిమాచల్ ప్రదేశ్. ఈ సందర్భంగా ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మరి కొద్దిరోజుల్లోనే ప్రపంచంలోనే ఎత్తయిన మౌంట్ ఎవరెస్టును అధిరోహించనుంది.
- Advertisement -