కేన్స్‌ ఫెస్టివల్..ఉత్తమ నటిగా అనసూయాసేన్‌

10
- Advertisement -

ప్రముఖ ఫిల్మ్ ఫెస్టివల్‌ కేన్స్‌లో భారతీయ సినిమా సత్తాచాటింది. వివిధ కేటగిరిల్లో భారతీయ సినిమాకు మూడు అవార్డులు దక్కాయి. కొత్త దర్శకురాలు పాయల్‌ కపాడియా తెరకెక్కించిన ఆల్‌ వి ఇమాజిన్‌ ఆజ్‌ లైట్‌ చిత్రానికి గ్రాండ్‌ప్రిక్స్‌ అవార్డు దక్కింది. ఇది కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ బహుకరించే రెండో అత్యుత్తమ అవార్డు. ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళా దర్శకురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు.

మూడు దశాబ్దాల్లో గ్రాండ్‌ప్రిక్స్‌ అవార్డును దక్కించుకున్న మొదటి భారతీయ సినిమా ఇది.ద షేమ్‌లెస్‌ చిత్రంలో తన నటనకు గానూ అనసూయసేన్‌ గుప్తా అన్‌ సైర్టెన్‌ రిగార్డ్‌ విభాగంలో ఉత్తమ నటి అవార్డును సాధించారు.

ఎఫ్‌టీఐఐ విద్యార్థి చిదానంద ఎస్‌ నాయక్‌ దర్శకత్వం వహించిన సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ధి ఫస్ట్‌ వన్స్‌ టు నో చిత్రం స్టూడెంట్‌ డైరెక్టర్‌ విభాగంలో ‘లా సినెఫ్‌’ పురస్కారానికి ఎంపికైంది.

Also Read:హనుమానసనంతో అంగస్తంభనకు చెక్‌!

- Advertisement -