భారత ఆర్మీ గ్రేట్: బ్రిటీష్ ఆర్మీ

266
- Advertisement -

పాకిస్తాన్ భూబాగంలో దాడులు చేయడంలో సత్తా చాటిన భారత సైన్యం.. అంతర్జాతీయ మిలిటరీ పోటీల్లోనూ మాకు మేమే సాటి అని భారత సైన్యం నిరూపించింది. అంతర్జాతీయంగా అత్యంత కఠిన విన్యాసంగా భావించే కాంబ్రియన్‌ పెట్రోల్‌లో గూర్ఖా రైఫిళ్లు స్వర్ణ పతకాన్ని సాధించారు. ప్రపంచంలోనే తిరుగులేదని భావించే సైన్యంలో ఒకటైన బ్రిటిష్‌ ఆర్మీ.. భారత సైనికుల అద్భుత విన్యాసానికి అచ్చరువొందింది. ‘భారత ఆర్మీ గ్రేట్‌’ అని ప్రశంసలు కురిపించింది. ఏటా అక్టోబరు-నవంబరు మాసాల్లో నిర్వహించే ఈ విన్యాసంలో ఈ దఫా భారత తరఫున పాల్గొన్న గూర్ఖా రైఫిల్స్‌ 2వ బెటాలియన్‌లోని 8 మంది సైనికులకు పసిడి పతకం లభించింది.

cam copy

‘కాంబ్రియన్‌ ప్యాట్రోల్‌లో స్వర్ణ పతకం గెలుచుకొన్న 8 గూర్ఖా రెండో బెటాలియన్‌ బృందానికి అభినందనలు. మీ ప్రతిభ అసాధారణం.. అద్భుతం’ అని బ్రిటిష్‌ ఆర్మీ పేర్కొంది.

వేల్స్‌లోని కఠినమైన కాంబ్రియన్‌ పర్వత ప్రాంతాల్లో బ్రిటిష్‌ ఆర్మీ ‘కాంబ్రియన్‌ పెట్రోల్‌’ పేరుతో అంతర్జాతీయ వార్షిక సైనిక విన్యాసం నిర్వహిస్తుంటుంది. దీనిలో పాల్గొనే సైనిక బృందాలు నిర్దేశిత 55 కిలోమీటర్ల దూరాన్ని 48 గంటల్లో చేరుకోవాల్సి ఉంటుంది. దీని ఆధారంగా ఈ బృందాలకు పాయింట్లను ఇస్తారు. ఈ పాయింట్ల ఆధారంగా పసిడి, రజత, కాంస్య పతకాలతోపాటు సర్టిఫికెట్లను బ్రిటిష్‌ సైన్యం అందిస్తుంది.యుద్ధ నైపుణ్యం, డ్రిల్స్‌ను దాటేయడం, ప్రథమ చికిత్స ప్రక్రియ, విమానాలు, వాహనాలు, సామగ్రిని గుర్తించడం, డ్రిల్స్‌లో పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేయడం, యుద్ధ ఖైదీల నిర్వహణ, హెలీకాప్టర్‌ డ్రిల్స్‌, మీడియాతో సంబంధాలు, రేడియో కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు ఇలాంటివి పోటీలో ఉంటాయి.

- Advertisement -