కరోనా వైరస్ కట్టడికి కోసం గాంధీ ఆస్పత్రిని కరోనా హాస్పిటల్‌గా మార్చిన సంగతి తెలిసిందే. విపత్కర పరిస్థితుల్లో నిస్వార్థంగా, అవిశ్రాంతంగా సేవలందిస్తూ పోరాటం చేస్తున్న కరోనా యోధులకు కృతజ్ఞతలు తెలుపుతూ సాయుధ దళాలకు చెందిన జెట్స్, రవాణా విమానాలు, హెలికాఫ్టర్లు దేశవ్యాప్తంగా వందన సమర్పణ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిపై పూలవర్షం కురిపించింది వాయు సేన.ఆస్పత్రి ఆవరణలోని ప్రొ.జయశంకర్ విగ్రహం వద్ద హైదరాబాద్ సీపీతో పాటు ఇతర అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు గాంధీ ఆస్పత్రి వద్ద క్యూలో నిల్చోగా వీరి సేవలకు సంఘీభావంగా వాయుసేన హెలికాఫ్టర్ ద్వారా పూల వర్షం కురిపించింది. దీనిపై డాక్టర్లు, నర్సులు, పోలీసులు హర్షం వ్యక్తం చేశారు.
శ్రీనగర్‌లోని దాల్ సరస్సు మీదుగా ఛండీగర్‌లోని సుక్నా సరస్సు మీదుగా, దేశ రాజధాని ఢిల్లీపై ప్రయాణిస్తూ కేరళలోని త్రివేండం వరకు ఈ ఎయిర్‌క్రాఫ్ట్స్ పూలవర్షం కురిపించాయి.