భారత వైమానిక దళంకు కొత్త యూనిఫాం

60
- Advertisement -

భారత వైమానిక దళం ఏర్పాటై 90వ వార్షిక దినోత్సవంలో భాగంగా కొత్త యూనిఫాంను అందుబాటులోకి తీసుకువచ్చింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి వాతావరణంలో తట్టుకునే విధంగా తయారు చేశారు. ఈ యూనిఫాంను ఎయిర్‌ ఫోర్స్‌ స్టాండింగ్‌ డ్రెస్‌ కమిటీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫాష్యన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌) సంయుక్తంగా రూపొందించాయి. ఐఏఎఫ్‌ లోని అధికారుల కోసం వెపన్‌ సిస్టమ్‌ బ్రాంచ్‌ను రూపొందించడానికి కేంద్రం ఆమోదం తెలిపిందని వీఆర్‌ చౌదరి ప్రకటించారు.

90వ రైజింగ్‌ డే సందర్భంగా ఈకార్యక్రమం చండీగఢ్‌లో నిర్వహించారు. చండీగఢ్‌లో జరిగిన ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఎయిర్‌ చీప్‌ మార్షల్ వీఆర్‌ చౌదరి హాజరయ్యారు. 90వ వార్షికోత్సవంలో దాదాపు 80విమానాలతో నిర్వహించిన ఎయిర్‌ షో ఆకట్టుకుంది. భారత వైమానిక దళంలో పనిచేస్తున్న సైనికుల కోసం ప్రభుత్వం శనివారం కొత్త యూనిఫాంను విడుదల చేసింది. స్వాతంత్య్రానంతరం తొలిసారిగా వైమానిక దళానికి కొత్త కార్యాచరణ శాఖ.. వెపన్‌ సిస్టమ్‌ బ్రాంచ్‌ను కూడా ఏర్పాటుచేస్తున్నట్లు ఎయిర్‌ చీఫ్‌ వీఆర్‌ చౌదరి తెలిపారు.

భారత వైమానిక కొత్త యూనిఫాం సైన్యం యూనిఫారాన్ని పోలి ఉంటుంది. వైమానిక దళం థీమ్ ఈసారి ట్రాన్స్‌ఫార్మింగ్ ఫర్ ద ఫ్యూచర్ అని తయారుచేశారు. యూనిఫాం డిజిటల్ నమూనా ఎడారి, పర్వత భూమి, అడవి వంటి ప్రదేశాల్లో సైనికులు తమ విధులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వర్తించేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది.

ఈ యూనిఫాంను తేలికపాటి ఫాబ్రిక్, డిజైన్‌తో తయారు చేశారు. ఈ యూనిఫాంతో కొత్తగా కంబాట్ యూనిఫామ్‌లో కంబాట్ టీ-షర్ట్, ఫీల్డ్ స్కేల్ డిస్‌రప్టివ్ టోపీ, కంబాట్ బోనీ హ్యాట్, డిస్ట్రప్టివ్ వెబ్ బెల్ట్, యాంక్‌లెట్ కంబాట్ బూట్లు, మ్యాచింగ్ టర్బన్ ఉన్నాయి.

- Advertisement -