లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో 1996లో వచ్చిన సినిమా ‘భారతీయుడు’. ఈ చిత్రానికి ఇన్నేళ్ల తర్వాత ఆ చిత్రానికి దర్శకుడు సీక్వెల్ తీస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళ్ హీరో, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.. ““ఇండియన్ 2 కోసం చిత్రీకరించిన కొన్ని సీన్లు ఇప్పుడు ఉపయోగించడం లేదు. వాటితో ఇండియన్ 3 తీసే ఆలోచనలో ఉన్నారు” అన్నారు. మరోవైపు ఈ చిత్రంలోని మేజర్ సీన్స్ చూసిన కమలహాసన్ సంతృప్తిని వ్యక్తం చేశారు.
అంతేకాదు, శంకర్ కు ఖరీదైన వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ వాచ్ ధర సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. దీనిపై శంకర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొత్తమ్మీద ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో శంకర్ తో పాటూ కమల్ కూడా ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ గురించి కొన్నాళ్లుగా సస్పెన్స్ నెలకొనగా, ఇప్పుడు ఓ క్లారిటీ తెలుస్తోంది. ఇండియన్2 రిలీజ్ సంక్రాంతికి ఉండకపోవచ్చని సమాచారం.
Also Read: సురేఖా వాణిని ఇబ్బంది పెడుతున్నారు
ఈ సినిమా వచ్చే సమ్మర్ రేస్‌లో నిలవనుందని ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. ఈ ‘భారతీయుడు 2’ చిత్రంలో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి ఓ పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. ఇండియన్ 2 అద్భుతంగా వచ్చింది అని, ముఖ్యంగా పొలిటికల్ పంచ్ డైలాగ్స్ బాగా పెలతాయి అని టాక్. ఈ సినిమా షూట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యిందట.
Also Read: మెగా ప్రిన్సెస్‌కు బారసాల.. అంబానీ నుంచి గిఫ్ట్