తొలి టెస్ట్ లో ఇండియా ఘన విజయం

418
Team india
- Advertisement -

వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఇప్పటికే వన్డే, టీ-20 సిరీస్ లను కైవసం చేసుకున్న టీమిండియా, ఇప్పుడు టెస్టు సిరీస్‌ లో కూడా బోణి కొట్టింది. తొలి టెస్ట్‌లో వెస్టిండీస్‌ను 318 పరుగుల తేడాతో ఓడించింది. టీమిండియా నిర్దేశించిన 419 పరుగుల ఛేదనలో వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 26.5 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటైంది.

రహానె సెంచరీతో విజృంభించాడు. వెస్టిండీస్ జట్టుపై భారత్‌ కు ఇదే అత్యుత్తమ విజయం కావడం గమనార్హం. భారత బౌలర్లలో బుమ్రా 7 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీయగా, ఇశాంత్ శర్మ 31 పరుగులిచ్చి 3, షమీ 13 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు.

వెస్టిండీస్ ఆటగాళ్లలో రోస్టన్ చేజ్ (12), కీమర్ రోచ్ (38), మిగెల్ కమిన్స్ (19) మినహా మరెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోవడం గమనార్హం. కాగా, విండీస్ తో రెండో టెస్టు ఈనెల 30 నుంచి కింగ్‌ స్టన్‌ లో జరుగుతుంది.

- Advertisement -