జింబాబ్వేపై భారత్‌ అలవోక విజయం

334
- Advertisement -

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ విజయాల జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజాగా చివరి సూపర్‌12లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ జింబాబ్వేను చిత్తుచిత్తుగా ఓడించింది.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ దిగిన భారత్‌ ఆరంభంలో రోహిత్‌శర్మ నిరాశపరిచిన తర్వాత వచ్చిన విరాట్‌తో కలిసి రాహుల్‌ నిలదొక్కుకున్నాడు. అంతలోనే విరాట్‌ వెనుదిరగడంతో సూర్యతో కలసి హాఫ్ సెంచరీతో మెరిశాడు. మరోఎండ్‌లో ఉన్న సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. దీంతో నిర్ణీత 20ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 186పరుగులు చేసింది.

187పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించే క్రమంలో జింబాబ్వే ఆదిలోనే చెతులేత్తేసింది. టీమిండియా పెసర్ల దాటికి జింబాబ్వే 115 పరుగులకే ఆలౌటయింది. సికిందర్ రజ్వా(34), బర్ల్‌(35) మినహా ఎవరు కూడా గొప్పగా ఆడలేదు.

దీంతో గ్రూప్‌-బీలో టాప్‌లో నిలిచిన భారత్‌ టీ20 కప్‌లో రెండో సెమీ ఫైనల్‌ ఆడనుంది. గురువారం రోజున ఆడిలైడ్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో భారత్‌ ఇంగ్లండ్‌తో తలపడనుంది. బుధవారంన తొలి సెమిఫైనల్‌లో సిడ్నీవేదికగా జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ పాకిస్థాన్‌ తలపడనుంది.

నవంబర్‌13న ఆదివారం రోజున మెల్‌బోర్న్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. దీంతో తెలుస్తుంది…ఎవరు పొట్టి కప్పు ఛాంఫియన్‌..

ఇవి కూడా చదవండి..

దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్ సంచలన విజయం

మునుగోడు మొనగాడు కూసుకుంట్ల..

పత్తా లేని చెయ్యి…

- Advertisement -