భారత మహిళల క్రికెట్‌లో తొలి సెంచరీ పూర్తి చేసిన మహిళా క్రీడాకారిణిగా అంజుమ్ చోప్రా చరిత్ర సృష్టించారు. దేశంలో మహిళా క్రికెట్ విప్లవానికి నాంది పలికారు. ఈమె 1995లో న్యూజిలాండ్ ద్వారా క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. 1977 మే20 న్యూఢిల్లీలో పుట్టారు. 17యేళ్లకు పైగా క్రికెట్ కెరీర్‌లో ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచారు. కాగా నేడు 46వ పుట్టినరోజు జరుపుకుంటున్నందున్న greattealaangana తరపున శుభాకాంక్షలు.
అంజుమ్ చివరిసారిగా 2012 మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదవ టీ20 మ్యాచ్‌తో ఆటకు గుడ్‌బై చెప్పింది. 127వన్డే మ్యాచ్‌లు ఆడిన ఆంజుమ్ 2856పరుగులు చేశారు. ఇందులో 18ఆర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో తొలి సెంచరీ నమోదు చేశారు. ఈమె కంటే ముందు మిథాలీ రాజ్ (7098)హర్మన్‌ప్రీత్ కౌర్(3322)స్మృతిమంధాన(3073)పరుగులతో ముందు వరుసలో ఉన్నారు. కానీ ఈ ఆటగాళ్లకు ఇన్సిపేరషన్ మాత్రం అంజుమ్ చోప్రా. మొత్తమీద ఆరు ప్రపంచకప్ ఎడిషన్లలో 4 ప్రపంచకప్ వన్డే మ్యాచ్‌లకు భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించారు. అలాగే 2టీ20 ప్రపంచ కప్‌కు కూడా ప్రాతినిధ్యం వహించారు.
Also Read: G20:నోరు పారేసుకున్న చైనా..కౌంటర్ ఇచ్చిన భారత్
భారత్ మహిళల జట్టు తొలిసారి విదేశి గడ్డపై టెస్ట్ విజయం ఈమె నాయకత్వంలో జరిగింది. భారత ప్రభుత్వం 2007లో అర్జున అవార్డుతో సత్కరించింది. అలాగే అంజుమ్ చోప్రాకు భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించింది.
Also Read: IPL 2023 :చెన్నైకి డిల్లీ షాక్ ఇస్తుందా?