వెస్టిండిస్-ఇండియా మ్యాచ్ ల షెడ్యూల్ ఖరారు

423
India Vs West indies
- Advertisement -

డిసెంబర్ 6వ తేది నుంచి వెస్టిండిస్ ఇండియాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఇండియాతో వెస్టిండిస్ 3 టీ 20లు, 3 వన్డే మ్యాచ్‌లు ఆడనున్నాయి. తాజాగా ఈ సీరిస్ షెడ్యూల్ ను ప్రకటించారు. వెస్టిండీస్‌తో డిసెంబ‌ర్ ఆర‌వ‌ తేదీన జ‌ర‌గాల్సిన మ్యాచ్ వేదిక‌ను మార్చారు. వాస్త‌వానికి ఈ మ్యాచ్ ముంబైలో జ‌ర‌గాల్సి ఉన్న‌ది. అయితే ఆ మ్యాచ్ వేదిక‌ను హైద‌రాబాద్‌కు మార్చారు. ఉప్ప‌ల్ స్టేడియంలో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ది.

రెండో టీ-20 డిసెంబర్ 8న తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో, మూడో టీ-20 డిసెంబర్ 11న ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో జరుగనుంది. అన్ని టీ 20 మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు ప్రారంభమౌతాయి.వన్డే షెడ్యూల్.. తొలి వన్డే డిసెంబర్ 15న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో, రెండో వన్డే డిసెంబర్ 18న విశాఖపట్నంలో, మూడో వన్డే డిసెంబర్ 22న కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరుగనుంది. వన్డే మ్యాచ్‌లన్నీ డే/నైట్ మ్యాచ్‌లే కావడం విశేషం.

- Advertisement -