ఐరాస ఎన్నికల్లో భారత్ గెలుపు..

216
uno
- Advertisement -

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ ఘన విజయం సాధించింది. మొత్తం 193 సభ్య దేశాలున్న ఐరాస జనరల్ అసెంబ్లీలో ఆసియా-పసిఫిక్ గ్రూప్(ఎపిజి) నుంచి భారత్ ఘన విజయం సాధించింది. భారత్‌కు అనుకూలంగా 184 దేశాలు ఓటేయడంతో శాశ్వత సభ్య దేశంగా భారత్ మరోమారు ఎన్నికైంది.

ఆసియా-పసిఫిక్ గ్రూప్‌లో భారతదేశం ఒకే అభ్యర్థిగా ఉంది. జనవరి 2021 నుంచి దశాబ్దం తరువాత కౌన్సిల్‌కు తిరిగి వస్తోంది. యుఎన్‌ఎస్‌సిలో భారతదేశం చివరిసారిగా పనిచేసినది 2011-12 కాలంలోనే.

భారత్‌ ఆసియా- పసిఫిక్ గ్రూప్‌కు ఎన్నిక కావడం ఇది ఎనిమిదోసారి. 1950-1951, 1967-1968, 1972-1973, 1977-1978, 1984-1985, 1991-1992 మరియు 2011-2012 అంతకముందు ఎన్నికైంది. భారత్‌తోపాటు ఐర్లండ్, మెక్సికో, నార్వే కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించాయి.

- Advertisement -