మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం జింబాబ్వేకు చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ షురూ చేసింది. ఆదివారం జరిగిన తొలి సెషన్‌లో రుతురాజ్, దీపక్ చహర్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. కోచ్ లక్ష్మణ్ ఈ సెషన్‌ను పర్యవేక్షించాడు. తేలికపాటి కసరత్తులు చేసిన ప్లేయర్లు తర్వాత ఫీల్డింగ్ ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. సిరాజ్, చహర్, ప్రసిధ్ బౌలింగ్‌ను సరిచూసుకున్నారు.
రాహుల్ రాకతో టీమ్‌లో మళ్లీ మార్పులు మొదలయ్యాయి. మొదటగా రాహుల్ ప్రభావం శుభ్‌మన్ గిల్‌పై పడింది. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన గిల్‌పై వేటు తప్పలేదు.
గిల్ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ సరైన దిశలోనే వెళ్తున్నది. కరీబియన్ సిరీస్‌లో బాగా ఆడినప్పటికీ టీమ్ వ్యూహాలు భిన్నంగా ఉన్నాయి. ఒక స్లాట్‌కు అనేక ప్రత్యామ్నాయాలను సిద్ధం చేయాలని మేనేజ్‌మెంట్ టార్గెట్‌గా పెట్టుకుంది. అందులో భాగంగానే గిల్‌ను మూడో ప్లేస్‌కు సిద్ధం చేస్తున్నారు అని మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ పేర్కొన్నారు.