కోహ్లీ సెంచరీ…భారీ స్కోరు దిశగా టీమిండియా

240
virat
- Advertisement -

రాజ్ కోట్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలిటెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. కెప్టెన్‌ కోహ్లీ సెంచరీతో రాణించడంతో భారత్ 500 పరుగులు దాటింది. ఓవర్ నైట్ స్కోరు 72 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన కోహ్లీ అదే దూకుడును కొనసాగించాడు. కోహ్లీకి ఇది కెరీర్‌లో 24వ సెంచరీ కాగా కెప్టెన్‌గా 17వ సెంచరీ.

కోహ్లీకి తోడు వికెట్ కీపర్ రిషబ్ పంత్ రాణించాడు. 92 పరుగులు చేసిన పంత్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. దీంతో ఐదో వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.  అనంతరం క్రీజులోకి వచ్చిన జడేజాతో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించే క్రమంలో కోహ్లీ 139 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టాడు.  ప్రస్తుతం భారత్ 6 వికెట్లకు కొల్పోయి 542 పరుగులు చేసింది.

తొలిరోజు ఓపెనర్ పృథ్వీ షా వన్‌ మ్యాన్‌ షోతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. పృథ్వీ షా (134;154 బంతుల్లో 19×4) ఆహా అనిపించగా.. పుజారా (86; 130 బంతుల్లో 14×4) రాణించాడు. గాయం కారణంగా కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌ ఆఖరి నిమిషంలో మ్యాచ్‌ నుంచి తప్పుకోవడంతో అతడి స్థానంలో క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.

- Advertisement -