నేడు భారత్ తో శ్రీలంక రెండో టీ20

376
ind-vs-sl
- Advertisement -

నేడు భారత్ తో శ్రీలంక రెండో టీ20 ఆడనుంది. రాత్రి 7 గంటలకు హోల్కర్ స్టేడియంలో రెండో టీ20 జరగనుంది. మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో తొలి మ్యాచ్‌‌ రద్దు కావడంతో.. సిరీస్‌‌పై పట్టు కోసం ఇరుజట్లు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్త సంవత్సరంలో ఎలాగైన బోణి కొట్టాలనే పట్టుదలతో ఉంది కోహ్లి సేన. ఇక ఈమ్యాచ్ తో ధావన్, బుమ్రాలు రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. గౌహతిలో మ్యాచ్‌‌ రద్దుకావడంతో.. రెండో టీ20 కోసం అదే జట్టును యధావిధిగా ఆడించనున్నారు.

నాలుగైదు స్థానాల్లో శ్రేయస్‌‌, రిషబ్‌‌ పంత్‌‌ ఎలా ఆడతారన్న ఆసక్తి కూడా మొదలైంది. పిచ్‌‌ను బట్టి ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతోనే ఆడే చాన్స్‌‌ ఉంది. దీంతో మనీశ్‌‌ పాండే, శాంసన్‌‌ మరోసారి బెంచ్‌‌కు పరిమితంకానున్నారు. ఇక హోల్కర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం అని చెప్పుకోవాలి. హోల్కర్‌ స్టేడియంలో ఒకే ఒక టీ20 మ్యాచ్‌ రెండేళ్ల క్రితం భారత్, శ్రీలంక మధ్య జరిగింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా తమ అత్యధిక టీ20 స్కోరు నమోదు చేసింది.

జట్లు
ఇండియా: కోహ్లీ(కెప్టెన్‌‌), ధవన్‌‌, రాహుల్‌‌, అయ్యర్‌‌, పంత్‌‌, దూబే, జడేజా, ఠాకూర్‌‌, సుందర్‌‌, కుల్దీప్‌‌/చహల్​, బుమ్రా.

శ్రీలంక: మలింగ (కెప్టెన్‌‌), అవిష్క, గుణతిలక, కుశాల్‌‌ పెరీరా, ఫెర్నాండో, రాజపక్స, ధనుంజయ, షనక, ఉడాన, హసరంగ, కుమార.

- Advertisement -