కరోనాతో టీ20 ప్రపంచకప్ రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్‌కి లైన్ క్లీయర్ కాగా తాజాగా బీసీసీఐ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ కంటే ముందే భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ కోసం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను నిర్వహించే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఆగస్టులో మూడు టీ20ల సిరీస్‌ని నిర్వహించాలని భావిస్తున్నారట. వాస్తవానికి మార్చిలో భారత్ – దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉండగా వర్షం కారణంగా సిరీస్‌ని వాయిదా వేసింది బీసీసీఐ. అప్పటినుండి పలు సిరీస్‌లు రద్దుకాగా ఇటీవలే పలుదేశాల్లో లాక్ డౌన్ సడలింపులతో మళ్లీ క్రికెట్ మొదలైంది.
ఇక యూఏఈ వేదికగా సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020ని నిర్వహించాలని బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అఫిషియల్ ప్రకటన వెలువడనుండగా అంతకమంటే ముందే ఆటగాళ్లకు ప్రాక్టీస్ కోసం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ని నిర్వహించేందుకు బీసీసీఐ సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.