ఆసియా కప్‌లో భారత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. సిరీస్‌లో వరుసగా మూడో విజయాన్ని నమోదుచేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సూపర్ – 4 సమరాన్ని విక్టరీతో ప్రారంభించింది. ఏకపక్షంగా సాగిన పోరులో బంగ్లాను చిత్తు చేసింది. బంగ్లా విధించిన 174 పరుగల లక్ష్యాన్ని అలవొకగా చేధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో జట్టును విజయపథంలో నడిపించాడు.
రోహిత్ శర్మ (83 నాటౌట్; 104 బంతుల్లో 5×4, 3×6) ,ధావన్ (40; 47 బంతుల్లో 4×4, 1×6) రాణించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోని (33; 37 బంతుల్లో 3×4), కార్తీక్ (1 నాటౌట్)తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో భారత్ 36.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది.
అంతకముందు బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా ఏ దశలోనూ భారత బౌలర్లను ఎదుర్కొలేకపోయింది. మెహది హసన్ మిరాజ్ (42; 50 బంతుల్లో 2×4, 2×6) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లో రవీంద్ర జడేజా (4/29),భువనేశ్వర్ (3/32), బుమ్రా (3/37) విజృంభించడంతో 49.1 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌటైంది. భారత్ తన తర్వాతి సూపర్-4 మ్యాచ్‌లో ఆదివారం పాకిస్థాన్‌తో తలపడుతుంది.