ఇండియా-కివీస్ ఐదో వన్డేలో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నాలుగో వన్డేలో తక్కువ స్కోర్‌కి ఆలౌట్ అయిన రోహిత్ సేన ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసి మంచి విజయాన్ని అందుకోవాలని భావిస్తుంది. ఇప్పటికే సిరీస్‌లో మూడు వన్డేలు గెలిచిన భారత్ సేన నాలుగో విజయం తమ ఖాతాలో వేసుకునేందుకు పక్కా ప్రణాళికలు వేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే నాలుగో వన్డే ఆటతీరును టీమిండియా ఆటగాళ్లు మరిచిపోయినట్టు లేదు. కివీస్‌తో జరుగుతున్న చివరిదైన ఐదో వన్డేలోనూ భారత ఆటగాళ్లు అచ్చం అలాగే ఆడుతున్నారు. 17 పరుగులకే మూడు వికెట్లు సమర్పించుకుని పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు.
ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ(2)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ శిఖర్ ధవన్ (6)ను బౌల్ట్ పెవిలియన్ పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు శుభమన్ గిల్ కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. 7 పరుగులు మాత్రమే చేసి మాట్ హెన్రీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. చివరి రెండు వన్డేలకి దూరంగా ఉన్న ఎంఎస్ ధోని ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. ఖలీల్ స్థానంలో షమీ ఆడనున్నాడు. కుల్దీప్ యాదవ్‌కి రెస్ట్ ఇచ్చిన టీం ఇండియా ఐదో వన్డేలో విజయ్ శంకర్‌ని ఆడిస్తుంది. భారత్ 35 ఒవర్లకు గాను 129 పరుగు చేసింది. అంబటి రాయుడు 52 కేధర్ జాదవ్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.