190 పరుగులకే న్యూజీలాండ్ ఆలౌట్

203
- Advertisement -

ధర్మశాల వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో న్యూజీలాండ్ 190 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ గెలిచిన ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా బౌలర్ల ధాటికి కేవలం 65 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది కివీస్‌. కివీస్‌ ఓపెనర్ గుప్తిల్ (12) విఫలం కావడంతో మరో ఓపెనర్ లాంతమ్ ఒక్కడే బ్యాటింగ్ భారాన్ని మోశాడు. 79 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

అత్యంత ప్రతిభావంతులతో కూడిన కివీస్ జట్టులో టేలర్, రోంకీ, సాంటనర్ డక్ అవుట్ లు కావడం.. నసీమ్ షా (10), విలియమ్సన్ (3), ఆండర్సన్ (4) విఫలం కావడంతో.. 106 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన టిమ్ సౌతీ సరిగ్గా పది ఓవర్లపాటు క్రీజులో నిలిచాడు. క్రీజులో ఉన్నంత సేపూ బంతిని బౌండరీ లైన్ దాటించడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కు రికార్డు భాగస్వామ్యంతో వ్యక్తిగత రికార్డు నెలకొల్పి అర్ధ సెంచరీ సాధించాడు. 6 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేసిన సౌతీ న్యూజిలాండ్ జట్టులో పదో నెంబర్ ఆటగాడిగా అర్ధ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అమిత్ మిశ్రా వేసిన తెలివైన బంతిని బౌండరీ లైన్ దాటించే క్రమంలో మనీష్ పాండే చేతికి చిక్కి 177 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో 9 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు 177 పరుగులు చేసింది. ఓపెనర్ లాంతమ్ కు చివరి బ్యాట్స్ మన్ సోధి(1) అండతో మరో 13 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ స్కోరు 190కి చేరింది. మిష్రా వేసిన బంతికి ఎల్బీడబ్ల్యూగా సోధి వెనుతిరగడంతో కివీస్ 190 పరుగులకు ఆలౌట్ అయింది. ఉమేష్ యాదవ్‌కు రెండు వికెట్లు, అమిత్ మిశ్రాకు మూడు వికెట్లు దక్కగా.. కెరీర్‌లో తొలి వన్డే ఆడుతున్న ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా మూడు వికెట్లు తీశాడు.

- Advertisement -