ఆయన.. రత్నం.. బంగారం: లక్ష్మీరాయ్

347
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ ‘ఖైదీ నెం.150’ చిత్రం షూటింగ్ శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి విడుదల చేసేందుకు నిర్మాత రామ్ చరణ్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం 70 శాతం పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. కొరియో గ్రాఫర్ లారెస్స్ ఈ పాటకు డాన్స్‌ కంపోజ్ చేయనున్నట్లు టాక్. ఇక క్యాథరీన్ స్థానంలో మెగాస్టార్‌తో కలిసి ఓ ఐటెం సాంగ్‌లో నటి రాయ్‌లక్ష్మి ఆడిపాడుతున్న సంగతి తెలిసిందే.

చిరంజీవితో కలిసి నటించడం తన కల అని రాయ్‌లక్ష్మి ట్వీట్ చేసింది. చిన్నప్పటి నుంచీ తాను మెగాస్టార్‌కి అభిమానినని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే మాటకు ఆయన నిదర్శనమని.. నిజమైన లెజెండ్‌! నేనే ప్రత్యక్ష ఉదాహరణ అని తెగ పొగిడేసింది చిరుని. అంతే కాకుండా మెగాస్టార్‌ రత్నం లాంటి మనిషి, మనసు బంగారం.. ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవడం లేదు’ అని రాయ్‌లక్ష్మి ట్వీట్‌ చేశారు. చిరంజీవి కుమార్తె సుస్మిత తనని చక్కగా రెడీ చేశారని తెలుపుతూ.. తొలిరోజు షూటింగ్‌లో దిగిన ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

161016ciniraailaxmi2

కాజల్‌ కథనాయికగా నటిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటుడు సునీల్‌ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు.

- Advertisement -