ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. వరుసగా మూడో వన్డేలోనూ ఘనవిజయం సాధించింది.దు వన్డేల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లుండగానే ఎగరేసుకుపోయింది. భారత్‌కు ఇది వరుసగా తొమ్మిదో వన్డే విజయం కాగా.. ఇప్పటికే టెస్టుల్లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్న భారత్, ఈ విజయంతో వన్డేల్లోనూ అగ్రస్థానాన్ని సాధించింది.
ఆసీస్ విధించిన 294 పరుగుల లక్ష్యాన్ని భారత్ 47.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (71; 62 బంతుల్లో 6×4, 4×6), అజింక్య రహానె (70; 76 బంతుల్లో 9×4) ఛేదనలో బలమైన పునాది వేస్తే.. తర్వాత హార్దిక్ పాండ్య (78; 72 బంతుల్లో 5×4, 4×6), మనీష్ పాండే (36 నాటౌట్; 32 బంతుల్లో 6×4) కీలక ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపించారు.
అంతకుముందు ఆసీస్ 6 వికెట్లకు 293 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (124; 125 బంతుల్లో 12×4, 5×6) మెరుపు శతకంతో జట్టుకు అద్భుత ఆరంభాన్నిచ్చినా.. స్టీవ్ స్మిత్ (63; 71 బంతుల్లో 5×4) కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినా.. ఆసీస్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. భారత బౌలర్లు చివరి ఓవర్లలో పుంజుకుని ఆసీస్‌కు కళ్లెం వేశారు. మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన పాండ్య.. సిరీస్‌లో రెండో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సాధించాడు. నాలుగో వన్డే గురువారం బెంగళూరులో జరుగుతుంది.