పోర్న్ స్టార్‌పై వార్న్ దాడి..!

259
Shane Warne hits lady P..star
- Advertisement -

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ తప్పతాగి ఓ మోడల్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి లండన్ నైట్ క్లబ్‌లో చోటుచేసుకుంది. మోడల్ వేలెరీ ఫాక్స్ ముఖంపై షేన్ వార్న్ దాడిచేయడంతో ఆమె కన్ను వాచిపోయింది. ఈ ఫొటోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫాక్స్ అతడిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ వ్యాఖ్యలు చేసింది.

‘ఓ మహిళపై చేయి చేసుకుని గర్వంగా ఫీలవుతున్నావా? నువ్వు ఎంతటి పేరు ప్రఖ్యాతలున్న వ్యక్తివైతే మాత్రం ఓ మహిళను కొట్టి తప్పించుకుందామని అనుకుంటున్నావా?..’ అంటూ ఆమె మండిపడింది. ఈ సంఘటనపై ప్రత్యక్షసాక్షులు కూడా తెలియజేశారు. ఫాక్స్‌ను షేన్ వార్న్ కొట్టగానే ఆమె కిందపడిపోయిందని తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలను, సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

గతంలోనూ షేన్ వార్న్ తన అసభ్య ప్రవర్తనతో ఓ బ్రిటిష్ నర్సును ఇబ్బందిపెట్టాడు. ఆమెకు అభ్యంతరకరమైన మెసేజ్‌లు పంపించాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అతడిని వైస్ కెప్టెన్‌ పదవి నుంచి తొలగించింది. అంతేకాదు అనేక మంది మహిళలతో అక్రమసంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఆయన భార్య సిమోన్ కూడా దూరంగా ఉంటోంది. ఇక ఇదిలాఉండగా..షేన్ వార్న్ తప్పతాగి ఓ మోడల్‌పై దాడికి పాల్పడ్డ ఘటన.. వెస్ట్ మినిస్టర్‌లోని హెర్ట్‌ఫోర్డ్ స్ట్రీట్‌లోని ఓ నైట్ క్లబ్‌లో జరిగినట్టు స్కాట్లాండ్ యార్డు పోలీసులు వెల్లడించారు. అలాగే ఆమె ఫిర్యాదుతో విచారణ చేపట్టామని తెలిపారు.

- Advertisement -