ఆసీస్‌కు మరో షాక్..

19
- Advertisement -

భారత్‌తో టెస్టు సిరీస్‌ ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే జోష్ హేజిల్‌వుడ్ జట్టుకు దూరం కాగా తాజాగా స్టార్ బౌలర్‌ కెమెరూన్ జట్టుకు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని కెప్టెన్ స్మిత్ వెల్లడించారు.

నాగ్‌పూర్ టెస్టులో ఆడేందుకు గ్రీన్‌కు ఇబ్బందిగా ఉందని చెప్పాడు. గ్రీన్ నెట్స్‌లో ప్రాక్టీస్‌లో కూడా పాల్గొనలేదని, ఈ క్రమంలో తొలి టెస్టుకు అతను దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపాడు.

రేపటి నుంచి ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి టెస్టు ఫిబ్రవరి 9 నుంచి 13వ తేదీ వరకు నాగ్‌పూర్ వేదికగా జరుగుతుంది. ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు.

టెస్టు మ్యాచ్‌ల తేదీలు ..

1వ టెస్ట్ – ఫిబ్రవరి 9 నుండి 13 వరకు (నాగ్‌పూర్)

2వ టెస్ట్ – ఫిబ్రవరి 17 నుండి 21వ తేదీ వరకు (ఢిల్లీ)

3వ టెస్ట్ – మార్చి 1 నుండి 5వ తేదీ వరకు (ధర్మశాల)

4వ టెస్ట్ – మార్చి 9 నుంచి 13 వ తేదీ వరకు (అహ్మదాబాద్)

- Advertisement -