ఆస్ట్రేలియా పర్యటనలో గెలిచేందుకు భారత జట్టుకు మరో అవకాశం. రెండో మ్యాచ్‌లో బౌలర్లు రాణించడంతో గెలిచే అవకాశం వచ్చినా వర్షం అడ్డుకోవడంతో నిరాశపడిన టీమ్‌ఇండియా ఈసారి అవకాశం వదులకోకూడదని భావిస్తోంది. అంతేకాదు సిరీస్ చేజార్చుకోకూడదంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి. 2017 ఆగస్టు తర్వాత టీ20 సిరీస్ కోల్పోకూడదంటే కూడా ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా గెలిచి తీరాల్సిందే..!
టీమిండియాతో జరగనున్న మూడో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్‌కు ఆ టీమ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. బెహ్రన్‌డార్ఫ్ స్థానంలో మిచెల్ స్టార్క్ టీమ్‌లోకి వచ్చాడు. అటు తాము కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకోవాలని అనుకున్నట్లు కోహ్లి చెప్పాడు. ఈ మ్యాచ్‌కు కూడా ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగుతోంది. సిడ్నీలో వర్షం కురిసే అవకాశం లేకపోవడం కాస్త ఊరట కలిగించే విషయం. ఇప్పటికే సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 లీడ్‌లో ఉండగా.. ఈ మ్యాచ్ గెలిచి సమం చేయాలని కోహ్లి సేన చూస్తోంది.