- Advertisement -
వరుస విజయాలతో జోరు మీదున్న టీంఇండియా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు సిద్దమైంది. మూడు వన్డేల్లో భాగంగా నేడు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా 1.30కి . తొలి వన్డే ప్రారంభం కానుంది. శ్రీలంక మ్యాచ్ లో రెస్ట్ తీసుకున్న ఓపెనర్ రోహిత్ శర్మ..ఆసీస్ తో తలపడేందుకు సిద్దమయ్యాడు. రోహిత్, ధావన్, రాహుల్ ముగ్గురు ఆడనుండటంతో ఎవరు ఓపెనింగ్ వస్తారన్న దానిపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
జట్టు అవసరాలను బట్టి తాను బ్యాటింగ్ ఆర్డరులో మార్పులకు సిద్ధమేనని కోహ్లీ తెలిపాడు. బుమ్రా రాకతో జట్టు బౌలింగ్ విభాగం మరింత బలంగా మారనుంది.. ఇప్పటివరకు ఆస్ట్రేలియా ఇండియాలు 57 వన్డే సిరీస్‌లు ఆడాయి. భారత్ 14, ఆస్ట్రేలియా 26 గెలిచాయి. రెండో వన్డే 17న రాజ్‌కోట్‌లో.. మూడో వన్డే 19న బెంగుళూరులో జరగనుంది.
- Advertisement -