అఫ్గానిస్థాన్‌తో భారత్‌ ఢీ

165
rohith
- Advertisement -

ఆసియా కప్‌లో భారత్ పోరు ముగిసింది. ఇవాళ నామమాత్రపు మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్తాన్‌తో తలపడనుంది. ఇవాళ రాత్రి 7.30 గంటల నుండి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి.. విజయంతో టోర్నీని ముగిస్తారేమో చూడాలి.

నిలకడలేని బ్యాటింగ్‌,చెత్త బౌలింగ్‌..వెరసి ఆసియా కప్‌లో భారత్‌ దారుణమైన ఫలితాలు చవిచూసింది. గ్రూప్‌ దశలో దాయాది పాకిస్థాన్‌పై, అనంతరం హాంకాంగ్‌పై విజయాలతో టోర్నీని ఉత్సాహంగా ఆరంభించిన రోహిత్‌ సేన ఆపై ఒక్కసారి చతికిలపడింది. కీలకమైన సూపర్‌-4 దశలో పాకిస్థాన్‌, శ్రీలంకపై ఓటములతో దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించింది.

భవిష్యత్తు కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్‌ పంత్‌ను కాదని దినేశ్‌ కార్తీక్‌కు జట్టులో చోటు కల్పించడం కూడా వ్యూహాత్మక తప్పిదమనే చెప్పొచ్చు. దీంతో ఆత్మవిశ్వాసం లోపించిన పంత్‌.. ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేపోయాడు. ఇలాంటి ఇబ్బందులను అధిగమించి జట్టు సమిష్టిగా సత్తాచాటాలని అభిమానులు ఆశిస్తున్నారు.

- Advertisement -