ఇంగ్లాండ్‌పై భారత్‌ ఘనవిజయం..

230
India v England, 2nd Test, Visakhapatnam,
- Advertisement -

విశాఖలో జరుగుతున్న రెండోటెస్ట్‌లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది టీమిండియా. 246 ప‌రుగుల తేడాతో ఓడించి ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. చివ‌రి రోజు తొలి సెష‌న్‌లోనే ఐదు వికెట్లు తీసి విజ‌యం ఖాయం చేసుకున్న కోహ్లి సేన‌.. రెండో సెషన్ ప్రారంభ‌మైన కొద్దిసేప‌టికే ప‌ని ముగించింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో కేవ‌లం 158 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

ఓవర్ నైట్ స్కోరు 87/2తో చివరి రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లండ్‌కు భారత స్పిన్నర్లు ఆదిలోనే షాక్ ఇచ్చారు. బంతిని గిరగిరా తిప్పుతూ పర్యాటక జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఆత్మ రక్షణలో పడేశారు. వీరి ధాటికి ఇంగ్లండ్ వెంట వెంటనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో డకెట్ డకౌట్ కాగా, రెండు పరుగులు చేసిన మొయిన్ అలీని జడేజా పెవిలియన్ చేర్చాడు. అనంతరం 6 పరుగులు మాత్రమే చేసిన స్టోక్స్ జయంత్ యాదవ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కీలక బ్యాట్స్ మెన్ రూట్ 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మెహమ్మద్ షమీ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిగాడు. అన్సారీ, అండర్సన్‌లు డకౌట్‌ అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో అశ్విన్‌, జ‌యంత్ యాద‌వ్ చెరో మూడు వికెట్లు, జ‌డేజా, ష‌మి చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.ఈ నెల 26 నుంచి మొహాలీలో మూడో టెస్ట్ మొదలవుతుంది.

India v England, 2nd Test, Visakhapatnam, India v England, 2nd Test, Visakhapatnam, India v England, 2nd Test, Visakhapatnam, India v England, 2nd Test, Visakhapatnam,

- Advertisement -