- Advertisement -
జూలై 31తో అన్ లాక్ 2.0 గడువు ముగస్తున్న నేపథ్యంలో అన్ లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం. ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలు,కోచింగ్ సెంటర్లు మూసివేసి ఉంచాలని తెలిపింది.
ఆగస్టు 5 నుంచి యోగా సెంటర్లు, జిమ్ములు తెరిచేందుకు అనుమతిచ్చి న కేంద్రం….సినిమా హాళ్లు, థియేటర్లు, బార్లు, స్విమ్మింగ్ పూళ్లు, ఎంటర్‌టైన్మెంట్ పార్కులు, ఆడిటోరియంలు, సమావేశ మందిరాలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇకనుంచి రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది.
కంటైన్‌మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని తెలిపింది. ఎట్‌హోం కార్యక్రమాలపై రాష్ట్రపతి, గవర్నర్లు నిర్ణయం తీసుకుంటారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
- Advertisement -