కరోనా రికవరీలో భారత్ టాప్!

140
corona

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజుకు 90 వేలకు పైగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 53 లక్షలు దాటగా ప్రపంచంలో రెండోస్ధానంలో ఉంది భారత్.

అయితే కరోనా రికవరీల్లో అమెరికాను దాటి అగ్రస్ధానంలో ఉంది భారత్‌. కరోనా మహమ్మారి నుండి 42 లక్షల మంది కోలుకున్నారని తెలిపిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రభుత్వం సకాలంలో తీసుకుంటున్న చర్యల వల్ల ఇది సాధ్యపడిందన్నారు.

గత 24 గంటల్లో 93,337 కొత్త కేసులు నమోదుకాగా 1,247 మంది మృతిచెందారు. కరోనా నుండి 42,08,432 మంది కోలుకోగా ప్రస్తుతం దేశంలో 10,13,964 యాక్టివ్‌ కేసులున్నాయి. 85,619 మంది కరోనాతో చనిపోయారు.