మలేరియా నివారణకు ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతిపై విధించిన ఆంక్షలను భారత్‌కు పాక్షికంగా ఎత్తివేసింది. ప్రపంచ దేశాల డిమాండ్ మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ అత్యవసరంగా అవసరమున్న దేశాలకు ఎగుమతి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కరోనా వ్యాధిని నయం చేయడానికి క్లోరోక్విన్ ట్యాబ్లెట్‌ను పరిష్కారంగా ఉపయోగిస్తుండటంతో ప్రపంచ దేశాల నుండి భారత్ పై ఒత్తిడి పెరిగింది. దీనికితోడు అమెరికా కూడా తమ దేశానికి క్లోరోక్విన్ ట్యాబ్లెట్లను ఎగుమతి చేయాలని కోరగా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మోడీ.
పారాసిటమాల్, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తగిన పరిమాణంలో పొరుగు దేశాలకు సరఫరా చేస్తామని చెప్పింది. ఈ మెడిసిన్స్‌ను అత్యవసరంగా అవసరమున్న దేశాలకు కూడా ఎగుమతి చేస్తామని ప్రకటించింది. ఈ మెడిసిన్స్ సరఫరాను రాజకీయం చేయొద్దని కేంద్ర విదేశాంగ శాఖ విజ్ఞప్తి చేసింది.