ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికపై భారతదేశం పాకిస్తాన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. చట్టబద్ధ పాలన, ప్రజాస్వామ్యం అంటూ పాకిస్తాన్ చేస్తున్న డొల్ల ఉపన్యాసాలను భారత ప్రతినిధి ఘాటుగా బట్టబయలు చేశారు. ముఖ్యంగా పాకిస్తాన్ స్వదేశంలోనే సైన్యం పన్నాగంతో జరిగిన “రాజ్యాంగ తిరుగుబాటు”ను ప్రస్తావిస్తూ, ప్రజాస్వామ్య విలువలపై మాట్లాడే నైతిక హక్కు ఆ దేశానికి లేదని స్పష్టం చేశారు.
ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు చేసే ముందు, పాకిస్తాన్ తన దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత, మానవ హక్కుల ఉల్లంఘనలపై దృష్టి పెట్టాలని భారత్ హితవు పలికింది. భారతదేశ అంతర్గత విషయాలపై మాట్లాడే హక్కు పాకిస్తాన్‌కు లేదని స్పష్టంగా తేల్చిచెప్పింది.
అదే విధంగా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమే అని, అది గతంలోనూ అలాగే ఉందని, ప్రస్తుతం కూడా అలాగే ఉందని, భవిష్యత్తులో కూడా ఎల్లప్పుడూ భారతదేశంలోనే భాగంగా ఉంటుందని భారత్ మరోసారి దృఢంగా ప్రకటించింది.
Also Read:VD14:రణబాలిగా విజయ్

