అమెరికాను భారీ మంచు తుపాను వణికిస్తోంది. తీవ్రమైన మంచు కురుపు, గడ్డకట్టే చలి కారణంగా దేశవ్యాప్తంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఇప్పటివరకు చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో కనీసం 29 మంది మృతి చెందగా, 15కి పైగా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. భారీ మంచు భారంతో విద్యుత్ లైన్లు తెగిపోవడంతో లక్షలాది మంది విద్యుత్ లేకుండా చీకట్లోనే గడుపుతున్నారు.
రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. రహదారులు మంచుతో కప్పుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రైలు, బస్సు సేవలు అంతరాయం పొందాయి. విమానాశ్రయాల్లో మంచు పేరుకుపోవడంతో సుమారు 17 వేల విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉష్ణోగ్రతలు చరిత్రలోనే కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, భద్రతా సూచనలు పాటించాలని సూచిస్తున్నారు.
Also Read:VD14:రణబాలిగా విజయ్

