పాకిస్తాన్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..

17
- Advertisement -

పాకిస్తాన్‌కు భారత్ స్ట్రాంగ్ హెచ్చరిక జారీ చేసింది. ఇకపై దేశంలో ఏ ఉగ్రచర్య జరిగినా మాపై యుద్ధంగానే పరిగణిస్తాం అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక నుంచి దేశంలో ఎలాంటి ఉగ్రవాద దాడి జరిగినా దానిని భారత్‌పై యుద్ధంగానే పరిగణిస్తామని, అందుకు ధీటుగా బదులిస్తామని స్పష్టం చేసిందని అధికార వర్గాలు వెల్లడించాయి.

యుద్ధ వాతావరణం నేపథ్యంలో పాక్‌కు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పాక్ చేసే ప్రతి ఎటాక్‌కు భారత సైన్యం ధీటుగా జవాబుఇస్తోంది.

గత నెల 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి యావత్‌ భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆ దాడిలో ఉగ్రవాదులు ఏకంగా 26 మంది పర్యాటకులను కాల్చిచంపడాన్ని ప్రపంచ దేశాలు ఖండించిన సంగతి తెలిసిందే.

- Advertisement -