సుడాన్‌కు యూఎన్‌ పీస్‌…

29
- Advertisement -

ప్రపంచ శాంతికి కృషి చేస్తున్న ఐక్యరాజ్యసమితికి భారతదేశం తన వంతు సహాయం చేసింది. సుడాన్‌లోని ఐక్యారాజ్యసమితి కార్యాలయంకు భారతదేశంనుంచి మహిళా శాంతి పరిరక్షకుల ప్లాటూన్‌ చేరవేసింది. మొట్టమొదటి సారిగా 2007లో లైబీరియాలో మహిళా బృందాన్ని మోహరించింది.

సుడాన్‌లోని అబేయ్‌లోని ఐక్యారాజ్య సమితి కార్యాలయానికి మరోక ప్లాటూన్‌ గ్రూప్‌ను పంపించిడం ద్వారా భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్‌ యూనిట్‌ కలిగి ఉన్న ఏకైక దేశం అవతరించనుంది. ఇందుకోసం భారత్‌ ఇద్దరు అధికారులు మరియు 25మంది ఇతర ర్యాంకులతో కూడిన బృందంను పంపనుంది. ఈ బృందం ముఖ్యంగా కమ్యూనిటీ ఔట్రీచ్‌ ప్రత్యేకతను కలిగి ఉంటారు. మరియు భారత బృందం విస్తృతమైన భద్రతా పరమైన విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది.

ఉత్తర సుడాన్‌, దక్షిణ సుడాన్‌ సరిహద్దుల వెంబడి ఈ బలగాలు మోహరించనున్నాయి. అంతేకాదు మానవతా సహాయాన్ని అందించడం కోసం కొన్ని సార్లు ప్రత్యేక ఆపరేషన్‌ భాద్యతలు చేపట్టవల్సి ఉంటుందని తెలిపారు. మరియు అబేయ్‌లోని పౌరులు మరియు మానవతా కార్మికులను రక్షించడంలో ప్లాటూన్ బలాన్ని ఉపయోగించుకునేందుకు ఐక్యరాజ్య సమితి కి అధికారం ఉంది. అక్టోబర్‌ 31 2022నాటకి బంగ్లాదేశ్‌ (7017) తర్వాత భారత్‌ (5887) మంది సైనికులు పంపింది. 12మిషన్‌లో భారత్ తన సహకారాన్ని యూఎన్‌కు అందించింది.

ఇవి కూడా చదవండి…

ఢిల్లీ మేయర్‌కై కొట్లాట…

ఖరీదైన పిల్లిగా…స్కాటిష్‌ ఫోల్డ్‌ ఒలివియా

ఉక్రెయిన్‌తో యుద్దం..పుతిన్‌ సంచలన ప్రకటన

- Advertisement -