దేశంలో 24గంటల్లో 80,834 కరోనా కేసులు నమోదు..

137
- Advertisement -

దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 80,834 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం… కొత్తగా 1,32,062 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,39,989కు చేరింది. మరో 3,303 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,70,384కు పెరిగింది.

ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,80,43,446 మంది కోలుకున్నారు. 10,26,159 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 25,31,95,048 మందికి వ్యాక్సిన్లు వేశారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 95.26శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 5శాతానికి దిగువకు పడిపోయిందని ఆరోగ్యశాఖ పేర్కొంది.

ప్రస్తుతం 4.74 శాతంగా ఉందని, రోజువారి పాజిటివిటీ రేటు 4.25శాతంగా ఉందని, వరుసగా 20వ రోజు పది కన్నా తక్కువన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 37.81 కోట్ల పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.

- Advertisement -