- Advertisement -
దేశంలో నిన్న కొత్తగా 30,773 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3,34,48,163కు చేరింది. ఇందులో 3,26,71,167 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడిన 3,32,158 మంది చికిత్స పొందుతున్నారు. మరో 4,44,838 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కాగా, గత 24 గంటల్లో కొత్తగా 38,945 మంది వైరస్ నుంచి బయటపడ్డారని, 309 మంది మరణించారని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 80,43,72,331 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. ఇందులో శనివారం ఒకేరోజు 85,42,732 మందికి వ్యాక్సినేషన్ చేశారు.
- Advertisement -