దేశంలో కొత్తగా 26,041 కరోనా కేసులు నమోదు..

152
covid
- Advertisement -

భారత్‌లో క్రమంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. దేశంలో కొత్తగా 26,041 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,36,78,786కు చేరింది. ఇందులో 3,29,31,972 మంది కోలుకోగా, 4,47,194 మంది బాధితులు మహమ్మారికి బలయ్యారు. మరో 2,99,620 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 29,621 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని, 276 మంది మరణించారని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 38,18,362 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని, దీంతో ఇప్పటివరకు 86,01,59,011 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీచేశామని తెలిపింది.

- Advertisement -