- Advertisement -
భారత్‌లో కోవిడ్ కేసులు మళ్లీ భారీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో కొత్తగా 13,313 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,33,44,958కి పెరిగింది. వీరిలో 4,27,36,027 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,941 మంది మృతి చెందారు.
గత 24 గంటల్లో 10,972 మంది కరోనా నుంచి కోలుకోగా… 38 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 83,990 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు 98.60 శాతంగా, పాజిటివిటీ రేటు 2.03 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా, క్రియాశీల రేటు 0.19 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,96,62,11,973 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 14,91,941 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
- Advertisement -