దేశంలో తొలి ఒమిక్రాన్ బీఏ.4 కేసు..

96
omicrone
- Advertisement -

ప్ర‌పంచ దేశాల‌ను గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది క‌రోనా. ఇప్ప‌టికే డెల్టా,డెల్టా ప్ల‌స్,ఒమిక్రాన్ వంటి వేరియంట్స్‌తో ఇబ్బందులు ప‌డిన ప్ర‌జ‌లను తాజాగా ఒమిక్రాన్‌లో మ‌రో స‌బ్ వేరియంట్ బీఏ.4 క‌ల‌వ‌ర పెడుతోంది. దేశంలో తొలి కేసు అది హైద‌రాబాద్‌లో న‌మోదైంది.

ఇండియన్ సార్స్ కోవ్-2 కన్సార్టియం ఆన్ జీనోమిక్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలోని మరిన్ని నగరాల్లో ఈ సబ్ వేరియంట్ కేసులు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్స్‌లో బీఏ.4 ఒక‌టి. ఒమిక్రాన్ వేరియంట్ కంటే ఇది ప్రమాదకారి కాదని అయితే వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుంద‌ని డ్య‌బ్లూహెచ్‌వో వెల్ల‌డించింది. బాధితులకు తీవ్రస్థాయి అనారోగ్య ముప్పు, ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఉండవు అని తెలిపింది.

- Advertisement -