భారత్‌లో తొలి HMPV కేసు..

0
- Advertisement -

భారత్‌లో తొలి హెచ్‌ఎమ్‌పీవీ కేసు నమోదైంది. చైనాలో తీవ్రంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుండగా భారత్‌లో తొలి కేసు వెలుగుచూసింది. బెంగళూరుకు చెందిన ఎనిమిది నెలల చిన్నారికి ఈ వైరస్‌ గుర్తించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

బెంగళూరులోని బాప్టిస్ట్‌ ఆసుపత్రిలో ఈ కేసు వెలుగు చూసింది. రాష్ట్రంలోని ల్యాబ్‌లో శాంపిల్స్‌ను పరీక్షించలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆ రిపోర్ట్‌ ఓ ప్రైవేటు ఆసుపత్రి నుంచి వచ్చిందని.. ప్రైవేట్‌ ఆసుపత్రి రిపోర్ట్‌పై తమకు ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించాయి. చైనాలో ప్రబలిని ఈ వైరస్‌ గురించి పూర్తి సమాచారం తమకు తెలియదని ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.

చైనాలో హ్యూమన్‌ మెటాప్న్యూమోవైరస్‌ వ్యాప్తి చెందుతున్నట్లు ఇటీవలే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. వైరస్‌ బాధితులతో అక్కడి ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. కొవిడ్‌-19 తర్వాత హెచ్‌ఎంపీవీ రూపంలో మరో ఆరోగ్య సంక్షోభం మొదలవబోతున్నదా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Also Read:KTR: ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్

- Advertisement -