తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

342
Ramanth kovind At Thirumala
- Advertisement -

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మూడు రోజుల ఏపీ పర్యటన సందర్భంగా నిన్న సాయంత్రం తిరుపతికి చేరుకున్నారు. ఈసందర్భంగా ఇవాళ ఉదయం కుటుంబసభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. పద్మావతి అతిథి గృహం నుంచి తొలుత వరాహస్వామిని దర్శించుకుని, ఆపై ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.

Ramnath Kovind Family At Thirumala

ఆలయ పూజారులు ఆయనకు పట్టువస్త్రాలను అందించి, స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లి, ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం కోవింద్ కుటుంబానికి తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వచనం చేశారు. నిన్న తిరుమలకు చేరుకున్న ఆయన, సాయంత్రం పద్మావతి అమ్మవారిని, కపిలేశ్వర స్వామివారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. మరికాసేపట్లో కోవింద్ శ్రీహరికోటకు వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి, చంద్రయాన్-2 ప్రయోగాన్ని దగ్గరుండి పరిశీలించనున్నారు.

- Advertisement -