REWIND 2023 : అనూహ్య పరిణామాలు!

21
- Advertisement -

2023లో పాలిటిక్స్ పరంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ఆయా పార్టీలకు కలిసొస్తే మరికొన్ని పార్టీలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ముఖ్యంగా ఏపీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశం, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, కర్నాటకలో బీజేపీ ఓడిపోవడం, జాతీయంగా చూస్తే దేశంలో సంచలనం రేపిన మణిపుర్ అల్లర్లు.. అబ్బో ఇలా అంశాలే ఉన్నాయి. ఇప్పటివరకు ముఖ్యమంత్రి పదవి అనుభవించినవారు జైలుకు వెళ్ళిన దాఖలాలు లేవు. కానీ ఏపీలో ఆ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో దాదాపు 50 రోజులకు పైగా రిమాండ్ ఎదుర్కోవాల్సి వచ్చింది.

దాంతో రిమాండ్ కారణంగా ఆయన జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత కేసులో సరైన ఆధారాలు లేకపోవడం, బాబు ఆరోగ్యం క్షీణిస్తుండడంతో కోర్టు పూర్తి స్థాయిలో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇక తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదిన్నర సంవత్సరాల తరువాత మొదటిసారి ప్రభుత్వం చేతులు మారింది. 2014, 2018 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ కు పట్టం కట్టిన ప్రజలు 2023 ఎన్నికల్లో మాత్రం అధికార మార్పు వైపు చూశారు. ఫలితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ మరియు బి‌ఆర్‌ఎస్ మద్య ఓటు షేర్ కేవలం 2 శాతం తేడా మాత్రమే ఉండడం గమనార్హం.

ఇక ఇదే ఏడాది మణిపూర్ అల్లర్లు దేశాన్ని ఒక్కసారిగా కుదిపేశాయి. రెండు వర్గాల మధ్య రాజుకున్న చిచ్చు ఏకంగా దేశ ప్రతిష్టకే భంగం కలిగేలా మారింది. ఇద్దరు మహిళలను నగ్నంగా రోడ్డుపై ఊరేగించడం, ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం, వందల కుటుంబాలు రోడ్డున పడడం.. ఇలా మణిపూర్ విషయంలో చోటు చేసుకున్నా అల్లర్లు అన్నీ ఇన్ని కావు. అయితే ఈ మణిపూర్ అల్లర్ల వెనుక బీజేపీ హస్తముందనే వార్తలు కూడా బాగా వినిపించాయి. ఇక ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించగా తెలంగాణల కాంగ్రెస్, మిజోరాంలో జెడ్పిఏం పార్టీ అధికారంలోకి వచ్చింది. మొత్తానికి ఏడాది కొందరికి తీపి గుర్తులను అందిస్తే మరికొందరికి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది.

Also Read:అందరికి నచ్చే.. సర్కారు నౌకరి

- Advertisement -