అబె తుది వీడ్కోలుకు హాజరైన ప్రధాని మోదీ

214
modi japan
- Advertisement -

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబె తుది వీడ్కోలు కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. అబె మరణానికి మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ఇప్పటికే అబె కుటుంబం ప్రైవేటుగా అంత్యక్రియలను పూర్తి చేసింది. కానీ ప్రభుత్వం మాత్రం నేడు అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికింది.

షింజో చితాభస్మాన్ని టోక్యో హాల్‌కు తీసుకొచ్చారు. ఇక్కడ వేలమంది ఆయనకు తుది నివాళిని అర్పించారు. 19తుపాకుల గౌరవ అభివాదాన్ని సమర్పించారు. జపాన్లో అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు అందుకొన్న రెండవ నేతగా అబె నిలిచారు.

షింజో అబె తన తొమ్మిదేళ్ల పదవీ కాలంలో నాలుగుసార్లు భారత్‌ను సందర్శించడం ఓ రికార్డు. క్వాడ్‌ భాగస్వామ్యం, బుల్లెట్‌ రైలు లాంటి మెగా ప్రాజెక్టులు, పలు అంతర్జాతీయ సంబంధాలల్లో భారత్‌-జపాన్‌ల మధ్య కీలక ముందుడుగలని చెప్పవచ్చు. భారత్‌ జపాన్‌ సంబంధాల్లో మోదీ-అబె శకం ఓ కీలక అధ్యాయం.

- Advertisement -