మహాత్మా గాంధీకి నివాళులర్పించిన మోదీ..

188
- Advertisement -

దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించి గాంధీజీకి నివాళులర్పించారు.

అనంతరం విజయ్ ఘాట్‌ వద్ద లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులు అర్పించారు. అంతకుముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ ఇరువురు నేతలకు నివాళులర్పించారు.

India pays tribute to 'Father of the Nation' with 'Swachh Bharat Abhiyan'

గాంధీజీ ఆదర్శాలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని మోదీ కొనియాడారు. ‘గాంధీ జయంతి సందర్భంగా బాపూజీకి శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నా..’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా.. దేశానికి ఆయన చేసిన సేవలను మోదీ గుర్తు చేసుకున్నారు. ‘రైతులు, జవాన్లలో స్ఫూర్తి నింపి, ప్రధానిగా దేశ సమగ్ర అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేసిన శాస్త్రీజీ సేవలను గుర్తు చేసుకోవాల్సిన తరుణమిదే..’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

India pays tribute to 'Father of the Nation' with 'Swachh Bharat Abhiyan'

 India pays tribute to 'Father of the Nation' with 'Swachh Bharat Abhiyan'

 

 

- Advertisement -